Message from Rev. JJ

ప్రియమైన స్నేహితులారా! క్రైస్తవ జీవితంలో ఒక్కసారైనా బైబిల్ గ్రంధాన్ని చదవాలి అన్న ఆశ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి, మరికొందరు వారి జీవితకాలంలో ఒక్కసారైనా పుణ్య భూమి యెరూషలేమునకు వెళ్లి రావాలని కోరుకుంటారు, దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమంత చదివినవారు ధన్యులు, ఎన్ని సార్లు చదివినా తనవి తీరదు, ఎందుకంటే చదివే ప్రతి సారి దేవుడు ఏదో ఒక ఆశీర్వాదమును ఇస్తూ, నూతన జీవముతో నింపుతున్న దేవునికి కృతజ్ఞతా స్తుతులను చెల్లించుచున్నాను, ఆమెన్. ఇప్పుడు మీరు చెదివే ఈ పరిశుద్ధ గ్రంధము అందరికి వివరముగా, సులువుగా ఉండు రీతిగా దేవుడు నాకు అనుగ్రహించిన నూతనమైన ఆలోచనా విధానమని నా అనుభవ పూర్వకముగా తెలియజేయుచున్నాను, దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ లోని విభాగములు వివరిస్త, హృదయానికి హత్తుకునే విధముగా అధ్యాయపు వివరణలను చూపిస్తూ, విషయసూచికను తలపిస్తూ ఉంటుంది, ఆయా అధ్యాయములలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో ఇట్టే చూడగలము. కొన్ని అధ్యాయములయందు బంగారు వాక్యములను చుసిన వెంటనే ఆ సందర్భములను, కథలను, ఆయా సన్వేషములను వెంటనే గుర్తు చేసుకొనగలము. మీరు కోరుకొన్న భాగమును లేక సందర్బములను లేక ఉపమానములను లేక బైబిల్ కథలను ఇట్టే పొందగలము, దేవుని అద్భుతకార్యములను, బైబిల్ వాక్యములను Google Search మాదిరిగా BIBLE Search విధానములో రూపొందించినదే JJ BIBLE ఇది దీని యొక్క ప్రత్యేకత, ఇందులో మరొక ప్రత్యేకతను గమనించ గలరు 66 పుస్తకములలో వున్నా ముఖ్యమైన భక్తుల, వ్యక్తుల పేర్ల ఆధారముగా (Apostles and Important Persons in JJ Bible List లో) మనము వెదికే విషయాలను 66 పుస్తకాల్లో ఇట్టే గుర్తించగలము. బైబిల్ కు సంబందించిన ఏ సమాచారమైనా క్షణములో గుర్తించగలరు, మీరు ఆశించినది తప్పక పొందగలరు, ఇంకా మీకేమైనా తెలుసుకోవాలన్న విషయాలు కావలసి ఉంటె మాకు వ్రాయండి, మీకు వాటిని అందజేయగలము, మీ సూచనలు నీ సలహాలు మాకు వ్రాయండి వాటిని తప్పక పాటించగలము. మీ అభిప్రాయములు మాకెంతో విలువైనని. JJ BIBLE ద్వారా ప్రతీరోజు దేవునితో సంబంధం కలిగి ఉండాలని, మెలకువతో దేవుని రాజ్యము కొరకు కనిపెట్టి ప్రార్ధించాలని కోరుతున్నాను, దేవుడు మిమ్ములను దీవించు గాక, ఆమెన్.

BIBLE Easy Search: A Quick Search through JJ BIBLE CONTENT Make your SEARCH EASY to optimise your content through JJ BIBLE. జె జె బైబిల్ ద్వారా మీరు ఈ 66 పుస్తకముల వివరణలు ఒక్క పేజీలోనే చూడగలరు అనగా ఒకొక్క పుస్తకంలోని విషయములు, ఒకొక్క అద్యాయముల విషయములను ఒక్క పేజీలోనే పొందుపరచాము అన్నది మా అభిప్రయము, ప్రతీ పుస్తకంలోని విశేషాలు (విశేషయములు), చరిత్ర, సమయ సందర్భాలు, జరిగిన సంఘటనలు ఇట్టే గమనించగలము, ఈ రీతిగా రూపొందించబడినదె JJ BIBLE, దేవునికి మహిమ కలుగును గాక. కీర్త 115:1 మాకు కాదు, యెహోవా మాకు కాదు నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలగునుగాక అన్న వాక్యమును అనుదినము చెప్పుకొంటూ సాగిపోతున్న నా సేవా జీవితము కొరకు ప్రార్థిస్తూ, కానుకలను, దశమభాగములను ప్రార్థనా పూర్వకముగా మా సేవా పరిచర్యకు ఇచ్చి దేవుని దీవెనలను పొందగలరు, మా సేవా పరిచేర్యకు చేయూతనిస్తూ ఈ వెబ్ సైట్ ను రూపొందించుటకు సహాయపడిన Jesus Family కుటుంబ సభుయులకు వందనములు, దేవుడు మిమ్ములను, మీ దాతృత్వమును, మీ శ్రమను, మీ పోత్సాహము బహుగా దీవించునుగాక, ఆమెన్. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని చెప్పబడిన వాక్యమును ఆధారము చేసుకొని ప్రతి దినము దేవుని వాక్యమును పరిశీలించి చదువుతు, చదివిన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆసక్తితో వాక్యమును అంగీకరిస్తూ, ప్రతిదినము లేఖనములు, ప్రవచనాలు, ప్రత్యక్షతలు మరియు దేవుని కట్టడలను పరిశోధించుచు, ఆజ్ఞవెంబడి ఆజ్ఞ, సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట అనగా 66 పుస్తకములలో దాచబడిన ధననిదే ఈ పరిశుద్ధ గ్రంధము. వాక్యాన్ని దినమంతా అనగా పగలు, రాత్రి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ వుండాలి అంటే దివారాత్రములు అని అర్ధము, అంతేకాదు మన నిత్య జీవితములో చేసుకొనే పనుల, ప్రయాణముల సమయంలో కూడా వాక్యమును ధ్యానిస్తు దేవుని నామమును స్మరణ చేసుకొంటూ ఉండాలి, అలా చెయ్యడం ద్వారా మన మనస్సు, మన తలంపులు దేవునితో ముడిపడివుంటాయి అప్పుడు మనము దేవునిలో మరింత బలపడి ఆత్మీయ దీవెనలను పొందగలము. యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. కీర్తనలు 105:4 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు “దివారాత్రము” దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1:2 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి.. యెషయా 34:16 ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు, దివారాత్రములు వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. JJ సూక్తులు ఈ గ్రంధమును చదువుతున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించే ఆత్మీయ దీవెనలు బహు విస్తరములు, ఇట్టి గొప్ప దేవునికి నా నిండు కృతజ్ఞతలను హృదయపూర్వకముగ చెల్లించుచున్నాను.


బైబిల్ కేవలం మనలను సర్వసత్యములోనికి నడిపించుట మాత్రమే కాదుగాని, దేవుని వాక్యము మనకు నిత్య జీవము కలిగిస్తూ దేవుని గూర్చిన జ్ఞానము పొందులాగున వివరిస్తుంది అందుకే JJ బైబిల్ గ్రంధము ద్వారా దేవుని వాక్యాన్ని అనుదినము చదువుతూ ధ్యానిస్తూ, వాక్యంలో దేవుడు అలంకార రూపకముగా చెప్పబడిన సంగతులు, వాక్య మర్మమములు, బైబిలు ప్రవచనాలు, ఆయన ప్రత్యక్షతలు, ఆత్మ చెప్పు సంగతులు, పరలోక రాజ్యమర్మములు గ్రహించాలని కోరుతున్నాను, జె జె బైబిల్ ద్వారా దేవుడు మిమ్ములను బహుగా దీవించునుగాక, ఆమెన్. యెషయా గ్రంథము 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యోహాను 5:39 లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చు చున్నవి. అపో.కార్యములు 17:11 వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. యెషయా 28: 13 ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును.

JJ BIBLE Caption: 'TITLE' శీర్షిక, పేరు, DEFINITION, CREDITS ఇలా ఎన్నో అర్దలు, JJ BIBLE అన్న పేరుకు ఒక శ్రేష్ఠమైన CAPTION కొరకు ప్రార్దించినప్పుడు దేవుడు నా మనస్సుకు, నా హృదయానికి ప్రీతికరమైన వాక్యమును దయచేసిన దేవునికి నా వందనములు. ఇంతకు JJ అంటే ఏమిటి అనుకుంటున్నారా మా మనసులో మాత్రం J అంటే JESUS J అంటే JEHOVAH, JJ అంటే JEHOVAH JIREH, JJ అంటే JUST JESUS. ఈ వెబ్ సైటును బట్టి దేవునికి వందనాలు, దేవునికె మహిమ కలుగునుగాక, Hallelujah ఆమెన్. “వాక్యము దేవుడై యుండెను” అన్న ఈ వాక్యము నా హృదయానికి బహు శ్రేష్ఠమైన వాక్యము, నా సేవా జీవితములో నా చేతులతో పరిశుద్ధ గ్రంథమును (బైబిల్) పట్టుకున్నప్పుడెల్ల నా దేవుడు నాతో ఉన్నాడు అన్న అనుభూతిని పొందేవాన్ని అంతేకాదు ఎవరైనా కానుకలను అర్పిస్తే నా మనసులో నిండుకున్న ఒక నమ్మకం వాక్యము దేవుడై యుండెను అన్న ఒక్క మాటను బట్టి కానుకను బైబిల్లో ఉంచి, తండ్రి దీవించుమని ప్రార్ధించేవాన్ని, ఇట్టి విశ్వాసముతో ప్రార్దించినప్పుడు దేవుడు వారిని వారి కుటుంబములను బహుగా దీవించడము నేను కళ్ళారా చూసాను. ఇది కొందరికి ఇష్టము కాకపోవచ్చు, నా హృదయానికి మాత్రం వాక్యము దేవుడై యుండెను అన్న నమ్మకం అంటే ఈ పరిశుద్ధ గ్రంధము దేవుడే అని నమ్ముతున్నాను. ఇట్టి మనస్సుతో, గొప్ప విశ్వాసము తోనే ప్రార్దించేవాన్ని, Glory to Jesus. నా ప్రియ స్నేహితులారా వాక్యము దేవుడై యుండెను అన్న ఈ వాక్యము మీరు ఏ రీతిగా అర్ధం చేసుకున్న వాక్యము అంటే బైబిల్, బైబిల్ అంటే దేవుడు గనుక వాక్యము దేవుడై యున్నాడు, The Word was God, Hallelujah, ఆమెన్! ఆమెన్!! ఆమెన్!!! ప్రియులరా! నీ వాక్యమునుగూర్చి నా నాలుక పాడును అన్న రీతిగనే దేవుడు నన్ను ప్రేమించి 1000 పాటలను వ్రాయుటకు, పాడుటకు కృప చూపిన దేవునికి వందనములు. మా ఇతర వెబ్ సైట్లయందు నా సాక్షమును చదవగలరు. కీర్తనలు 119:172 నీ ఆజ్ఞలన్నియు న్యాయములు నీ వాక్యమునుగూర్చి నా నాలుక పాడును. కీర్తనలు 119:18 PSALM నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. Open my eyes that I may see wonderful things in your law. కీర్తనలు 119:74 నీ వాక్యముమీద నేను ఆశపెట్టుకొని యున్నాను నీయందు భయభక్తులుగలవారు నన్ను చూచి సంతో షింతురు. కీర్తనలు 119:105 నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. హెబ్రీయులకు 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది. యోహాను 8:47 దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. రోమా 2:13 ధర్మశాస్త్రము వినువారు దేవునిదృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.